Nuvvu Nenu Prema: తను ఇష్టపడిన స్త్రీ సమక్షంలో కాకుండా, మరో స్త్రీ సమక్షంలో తను ఆనందం పొందటాన్ని అర్థం చేసుకోలేక పోతున్న ఒక విక్రమాదిత్య కథ ఈ నువ్వు నేను ప్రేమ.. ఈవారం ఏం జరిగిందో చూద్దాం.
విక్కీ దగ్గరికి వెళ్లి ఒప్పిస్తానని గొప్పలు పోయాను కానీ వెళ్ళటానికి భయంగా ఉంది అనుకుంటుంది పద్మావతి. కానీ గరుడ ధైర్యం చెప్పి పంపిస్తుంది. తను ఆఫీస్ కి వెళ్లే సమయానికి మాయా విక్రమాదిత్యతో తిట్లు తింటూ ఉంటుంది. దాంతో మరింత భయపడుతుంది పద్మావతి. పద్మావతిని చూసిన మాయ తను తిట్లు తప్పించుకోవటానికి మాయని విక్రమాదిత్య దగ్గర ఇరికించేస్తుంది.
నాతో ఏదో మాట్లాడాలన్నావంటా ఏంటి విషయం అని అడుగుతాడు విక్కీ. భయపడుతూనే నాతో వస్తేనే చెప్తాను అంటుంది పద్మావతి. ఏంటి నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటూ మళ్ళీ కోప్పడతాడు విక్కీ. కానీ తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆమె వెనకే వెళ్తాడు. పద్మావతి విక్కీని తీసుకుని వెళ్తుంటే మాయ, అటెండర్ ఆశ్చర్యంతో నోరెళ్ళబడతారు. విక్రమాదిత్య గారిని ఒప్పించారంటే పద్మావతి గారు చాలా గ్రేట్ అంటాడు అటెండర్.
విక్కీ ని బయటికి తీసుకెళ్లిన పద్మావతి నేరుగా అతన్ని ఒక అనాధ ఆశ్రమానికి తీసుకు వెళ్తుంది. అక్కడ పిల్లలందరూ తనతో అభిమానంగా ఉండటం అతనికి కొత్తగా అనిపిస్తుంది. పిల్లలందరూ విక్రమాదిత్య కి అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఆ అభిమానానికి కన్నీరు పెట్టుకుంటాడు విక్కీ. మరోవైపు అనుతో మీ చెల్లికి పెళ్లి చేయరా అంటాడు హర్ష.
తను చేసుకోదంట, ఒకవేళ చేసుకున్న ఇల్లరికం కావాలంట, అమ్మ నాన్నకి తోడుగా ఉంటుందంట అంటుంది అను. అయితే మాత్రం వదిలేస్తారా మీరు ఒప్పించి చేయాలి కదా అంటాడు హర్ష. అనాధాశ్రమం నుంచి బయటికి వచ్చిన విక్కి నా పుట్టినరోజు ని నాకే తెలియకుండా కొత్తగా చేశావు ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటాడు. మనం మన సంతోషం కోసం కాకుండా పక్క వాళ్ళు సంతోషం కోసం కూడా జీవిస్తే ఆ ఆనందమే వేరు.
మీరు ఎవరో తెలియకపోయినా ఆ పిల్లలు మీ బర్త్డే సెలబ్రేట్ చేసి చాలా సంతోషించారు అలాంటిది మీ అక్క వాళ్ళు ఇంకెంత సంతోషిస్తారు, అంటూ అతన్ని పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి ఒప్పిస్తుంది పద్మావతి. అదే విషయాన్ని అరవింద వాళ్లతో చెప్తే వాళ్లు ఒక పట్టాన నమ్మరు. కానీ విక్కీ వచ్చి నీ ఆనందం కోసం ఈ బర్త్ డే కి ఒప్పుకున్నాను నీ ఇష్టం అంటూ అరవింద కి చెప్తాడు.
ఆశ్చర్యంతో అందరూ చాలా సంతోషిస్తారు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినందుకు పద్మావతిని కుటుంబ సభ్యులందరూ మెచ్చుకుంటారు. అందరితోపాటు మాయా కూడా పద్మావతిని పొగుడుతుంటే కుచల ఆమెకి చివాట్లు పెడుతుంది నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే పద్మావతి, విక్కీని తన్నుకు పోతుంది అంటూ హెచ్చరిస్తుంది.మరోవైపు భర్తని బయటికి అరవింద. బయటికి వెళ్తే పద్మావతి వాళ్లకి దొరికిపోతాను అంటూ టెన్షన్ పడిపోతాడు కృష్ణ.
పద్మావతిని అనుని పార్టీకి పిలిచినందుకు చిరాకు పడుతుంది కుచల. పార్టీలో అను చీర మీద డ్రింక్ ఒంపేసి, ఈ చీరతో పార్టీలో తిరిగితే మా పరువు పోతుంది ఇంటికి వెళ్ళిపో అంటుంది. వెళ్ళబోతున్న అను ని ఆపి తను గదికి తీసుకొని వెళ్లి తనకోసం కొన్న నగలు చీరలు చూపించి ఇందులో నీకు నచ్చింది కట్టుకో అంటాడు ఆర్య. నువ్వు నా మీద చూపిస్తున్న ఈ పిచ్చి ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను అంటూ ఆర్యని హత్తుకుంటుంది.
Nuvvu Nenu Prema: పద్మావతి నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు..
మరోవైపు బర్త్డే పనుల్లో నిమగ్నమైన పద్మావతిని అన్ని పనులు చేస్తున్నావు కానీ నేను చెప్పిన పని చేశావా అంటాడు విక్కీ. ఏ పనో అర్థంకాని పద్మావతి తెల్లమొహం వేస్తుంది. అదే మాయా అంటే నాకు ఇష్టం లేదని తనతో చెప్పమన్నాను కదా, తనకి ఎలాగైనా ఈ విషయాన్ని నువ్వే చెప్పాలి అంటూ ఆర్డర్ వేస్తాడు విక్కీ. ఆ మాటలకి తల పట్టుకు కూర్చుంటుంది పద్మావతి. విక్కీ చెప్పిన పని పద్మావతి చేస్తుందా? కుచల ప్రభావంతో మాయ పద్మావతిని అనుమానిస్తుందా? ఇరకాటంలో పడ్డ కృష్ణ, పద్మావతి వాళ్లకి దొరికిపోతాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే,