Nuvvu Nenu Prema: తమ మనసులో ఉన్నది ప్రేమ అని తెలియక, కీచులాడుకుంటూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్న ఒక జంట కధ నువ్వు నేను ప్రేమ.
అందరూ విక్కీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో హడావుడిగా ఉంటారు. పార్టీ నుంచి వెళ్ళిపోమంటూ అనుని అవమానిస్తుంది కుచల. కానీ ఆర్య ఆమెని సేవ్ చేస్తాడు. అతని ప్రేమకి కరిగిపోతుంది అను. అను తన పేరెంట్స్ ని ని అందరికీ పరిచయం చేస్తుంది. విక్కీని చూసి మురిసిపోతున్న మాయ పేరెంట్స్ ని రెచ్చగొడుతుంది కుచల. మీరు త్వరగా పెళ్లి ఫిక్స్ చేయండి లేకపోతే విక్కీ ఈ పెళ్లి వద్దు అంటే మీకే నష్టం అంటుంది. మరోవైపు కృష్ణని పార్టీలోకి తీసుకురావడానికి నానా తంటాలు పడుతుంది అరవింద.
పద్మావతిని మీ చెల్లి అంటుంటే ఇరిటేట్ అయిపోతుంటాడు కృష్ణ. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగలాగా వచ్చి విక్కీని విష్ చేసి మళ్లీ కామ్ గా వెళ్ళిపోతాడు. పార్టీలో తెగ అల్లరి చేస్తున్న పద్మావతిని చూసి కోప్పడతాడు విక్కి. నాకు మాయ అంటే ఇష్టం లేదని చెప్పు అంటూ పద్మావతి తో చెప్తాడు విక్కీ పార్టీలో విక్కికి ఒక పెయింటింగ్ ని ప్రజెంట్ చేస్తుంది పద్మావతి. ఆ ప్రజెంటేషన్కి అరవింద విక్కీ ఎమోషనల్ అయిపోతారు.
స్టేజ్ మీద పద్మావతిని వాటేసుకుని నువ్వు నాకు ఇచ్చింది గిఫ్ట్ కాదు మెమొరీ అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. అది చూసి భరించలేక పోతాడు కృష్ణ. నేరుగా మాయ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళని రెచ్చగొడతాడు. మాయ తండ్రి నేరుగా స్టేజి మీదకి వెళ్లి వాళ్ళ మ్యారేజ్ ని అనౌన్స్ చేస్తారు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు పద్మావతి ఆనందంతో పొంగిపోతుంది. అది చూసి మరింత కోప్పడతాడు విక్కీ. పద్మావతి కలిసి తిరుగుతారా ఇప్పుడు తిరగండి అంటూ ఆనందంతో గంతులు వేస్తాడు కృష్ణ.
ఈ పెళ్లి విక్కీ గారికి ఇష్టం లేదా అని అడుగుతుంది అను. అవును అంటుంది పద్మావతి. ఆయన మనసులో ఎవరున్నారో పాపం ఈయన గారి కోపానికి బలైపోతుంది జాలి పడుతుంది. మరోవైపు విక్కీ కోసం తనకి ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది మాయ. ఆమెని సరదాగా ఆటపట్టిస్తుంటారు అరవింద, కుచల. విక్కీని టిఫిన్ చేయమంటే నాకు పని ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ ప్రవర్తనకి మాయా హర్ట్ అవుతుంది.
మరోవైపు అక్క పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది ఇంటికి నేనే మహారాణి అంటూ అక్కని ఏడిపిస్తుంది పద్మావతి. నువ్వు మాత్రం వెళ్ళిపోవా అంటే ఈ మహారాణి కోసం రెక్కల గుర్రం మీద ఒకడు వస్తాడు చదువుతుంది పద్మావతి. మరోవైపు పద్మావతి మీద కోపంతో రగిలిపోతుంటాడు విక్కీ, లివిన్లో ఉండడానికి వచ్చిన పద్మావతిని పెళ్లి లేకపోతే జీవితం లేదు అన్నట్లుగా తయారు చేసింది పద్మావతి ఇక నా ఆలోచనలతో తనకు ఏమీ పని లేదా అంటూ కోపంగా పద్మావతి దగ్గరికి వెళ్తాడు విక్కీ.
ఇంట్లోకి వెళ్ళకుండా గుమ్మం లోంచి పద్మావతిని పిలుస్తాడు. విషయం అర్థం చేసుకున్న పద్మావతి ఈయన నన్ను తిట్టడానికే వచ్చాడు అనుకుంటూ బయటికి వెళ్ళటానికి నానా వంకలు పెడుతుంది. అది అర్థం చేసుకున్న పార్వతి ఆయన మగపిండి తరపు ఆయన్ని బాధ పెట్టొద్దు అంటే తప్పక విక్రమాదిత్యతో బయటికి వెళుతుంది. పద్మావతిని ఊరి చివరికి తీసుకొని వెళ్లి తన కోపాన్ని అంతా అక్కడ వెళ్లగకుతాడు.
ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావు కానీ నాకు ఈ పెళ్లికి ఎందుకు ఇష్టం లేదో అంటూ ఒక్కసారైనా ఆలోచించావా అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మొహం నాకు చూపించొద్దు అంటాడు. మాయ మేడమ్ కి ఏం తక్కువ అయినా నా పని నేను చేశాను ఇందులో నా తప్పేముంది అయినా నా మొహం చూపించొద్దు అన్నారు కదా ఇంక మీదట మీరు అడిగిన నేను చూపించను అంటూ ఏడుస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి.
ఇంటికి ఆలస్యంగా వచ్చిన పద్మావతిని ఎందుకు లేట్ అయింది అని తల్లి అడిగితే అబద్ధం చెప్పేస్తుంది. కానీ ఏదో జరిగిందని అను అర్థం చేసుకుంటుంది. మరోవైపు షాపింగ్ ప్లానింగ్ వేసుకుంటారు విక్కీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మాయ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఏ సమస్య లేదు నాకు ఏం కావాలో పద్మావతికి బాగా తెలుసు మంచి అయితే నాకు టెన్షన్ లేదు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కి ఆమెని కోప్పడతాడు అన్నిటికీ పద్మావతి మీద డిపెండ్ అవుతున్నావు ఈ ఇంట్లో పద్మావతి పెత్తనం ఎక్కువ అయిపోతుంది.
నీ ఓన్ ఐడెంటిటీని నువ్వు కోల్పోవద్దు నువ్వు నీలాగా ఉండు అంటూ మాయ మీద కేకలు వేసి వెళ్ళిపోతాడు. బాధపడుతున్న మాయని అరవింద వాళ్ళు కూల్ చేస్తారు. ఒకవైపు అను, ఆర్యని కలిసి మీ అన్నయ్య పద్మవతిని ఎక్కడికో తీసుకెళ్లారు ఆ తర్వాత తను చాలా మూడీగా ఉంది ఏం జరిగిందో చెప్పడం లేదు అంటుంది. నేను విక్కీని కనుక్కుంటాను అంటాడు ఆర్య. మరోవైపు నేను విక్రమాదిత్య గారితో అనవసరంగా గొడవపడ్డాను.
అది మనసులో పెట్టుకుంటే రేపు ఆ ఇంటికి వెళ్లి మా అక్క బాధపడుతుంది నావల్ల ఇంట్లో వాళ్లకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది పద్మావతి. అదే సమయంలో పద్మావతిని గురించి ఆలోచిస్తున్న వ్యక్తి అనవసరంగా తనని బాధపెట్టాను అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తాడు. తిట్టడానికే ఫోన్ చేసాడేమో అనుకొని ఆమె ఫోన్ కట్ చేసేస్తుంది. అందుకు కోపగించుకున్న విక్కీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు.
మరోవైపు వికీ దగ్గరికి వచ్చినా ఆర్య నువ్వు పద్మావతి ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు. తను చాలా మంచిది ఎదుటి వాళ్ళ సంతోషం కోరుకుంటుంది తనని ఎప్పుడు బాధ పెట్టొద్దు అంటాడు. అదే సమయంలో అరవింద పెళ్లి కార్డులు సెలక్షన్ కోసం కృష్ణని రమ్మంటుంది. మాయా విక్కీల పెళ్లి ఓకే గాని అను,ఆర్యల పెళ్లి ఎలాగైనా తప్పించాలి అనుకుంటూ ప్లాన్ వేస్తాడు కృష్ణ.
అందుకోసం కుచలని రెచ్చగొడతారు మీకు డబ్బున్న కోడలు కాకుండా ఇంట్లో పని చేసే కోడలు ఉంటే సరిపోతుంది అనుకుంటాను, ఆ సంబంధం వాళ్ళకి వద్దని చెప్పేస్తాను లేకపోతే నాకు మాట పోతుంది అంటాడు కృష్ణ. అలా చేయకండి ఎలా అయినా నేను అను, ఆర్యల పెళ్లి తప్పిస్తాను అంటుంది కుచల. మరోవైపు మూడిగా ఉన్న విక్కీ, ఎందుకు అలా మూడిగా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి నా బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టను అని అనుకుంటాడు విక్కీ.
Nuvvu Nenu Prema: ఏ ట్విస్టులు లేకపోవడం, కథ కూడా స్లోగా ఉండటంతో సో, సో గా ఉంది అంటున్న ప్రేక్షకులు..
బయటికి మాత్రం ఏమీ జరగలేదు అక్క అంటాడు. నువ్వు ఏమీ జరగలేదు అనడంలోని ఏదో ఉందని అర్థం అవుతుంది. అదేంటో చెప్పు అంటుంది అరవింద. విక్కీ తన బాధని అక్కతో చెప్పుకుంటాడా? మాయతో పెళ్లికి ఒప్పుకుంటాడా? కృష్ణ ప్లాన్ ఏమౌతుంది? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.