Pallakilo Pellikuthuru December 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తన అత్తింటి వారిని అవమానించినందుకు తల్లిని నానా మాటలు అంటుంది శశి. అక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు ఉన్నాయి. నేను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్తే అది అత్తగారిల్లు అవుతుంది కానీ నిజానికి అది నాకు పుట్టిల్లు. నువ్వు చేసిన గాయాన్ని మాన్పించింది వాళ్లే.
తల్లిని పెత్తనాలు చెయొద్దంటున్న శశి..
ఆ సంబంధం నచ్చలేదు అన్న అర్హత నీకు ఎలా వస్తుంది, తనకు నచ్చిన వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసే అర్హత ఒక్క మా డాడీకే ఉంది. అనవసరంగా మధ్యలో దూరి పెత్తనం చేద్దామని చూడొద్దు అంటూ తల్లిని తిడుతుంది శశి. అసలు తప్పంతా నీది అలాంటి పనికిమాలిన సంబంధం తీసుకువచ్చి అదేదో గొప్ప సంబంధం అన్నట్టు నా కూతుర్ని నమ్మించావు అంటూ భర్తని తిడుతుంది సుభాషిని.
బుద్ధున్న తండ్రి ఎవరైనా కూతురికి ఇలాంటి సంబంధం తీసుకు వస్తారా అంటుంది. మా డాడీ ని తక్కువ చేసి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ తల్లి మీద రెచ్చిపోతుంది శశి. నీ స్టేటస్ ని పెంచే ఏ సెలబ్రిటీనో పెళ్లి చేసుకోకుండా ఒక చిన్న సైంటిస్ట్ ని పెళ్లి చేసుకోవడం నాకు బాధగా ఉందమ్మ అంటుంది సుభాషిని. నువ్వు అనుకున్నట్టు అభి చిన్న సైంటిస్ట్ ఏం కాదు సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ సైంటిస్ట్.
తల్లిని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న శశి..
నీ భాషలో చెప్పాలంటే పెద్ద సెలబ్రిటీ. అలాంటి సైంటిస్ట్ కి భార్య నైతే నాకు సొసైటీలో స్టేటస్ పెరుగుతుంది. నాకు తెలిసి భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్యకంటే ఒక సైంటిస్ట్ భార్యకే సొసైటీలో వాల్యూ ఎక్కువ అంటుంది శశి. ఇది మా డాడీ నిర్ణయించిన పెళ్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నా పెళ్లి చూసే హక్కు నీకు ఉంది కాబట్టి చూడాలనిపిస్తే చూడు లేదు అంటే డాడీ చెప్పినట్టు బయటికి వెళ్ళిపో.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శశి. శశి చెప్పింది అర్థమైందా అంటాడు రాజశేఖర్. అర్థమైంది తీసుకుంటాను చాలా తొందరలోనే నిర్ణయం తీసుకుంటాను అంటుంది సుభాషిని. మరోవైపు సుభాషిని అన్న మాటలు తలుచుకొని అభి కుటుంబ సభ్యులందరూ బాధపడతారు. పెళ్లికి ముందే ఎన్ని మాటలు ఆవిడ గారు అన్నదంటే రేపు పొద్దున్న ఇంక ఎన్ని మాటలు అంటుందో అంటూ బాధపడుతుంది అభి వాళ్ళ అత్త.
శశిని తిట్టుకుంటున్న అభి..
పెదనాన్న, శేఖర్ అంకుల్ వారించారు కాబట్టి ఊరుకున్నాను లేకపోతే మాటకు మాట చెప్పి ఆవిడ నోరు మూయించే వాడిని అంటాడు అభి. సర్లే ఆ మాటలన్నీ తెలుసుకుని బాధపడే కన్నా వదిలేయడమే మంచిది అంటుంది అభి వాళ్ళ అమ్మ. పెళ్లి అయ్యేవరకు ఆవిడని భరిస్తే సరిపోతుంది అనుకుంటారు వాళ్లు. అంతలోనే శశి అక్కడికి రావడం చూసి అందరూ మాటలు ఆపేస్తారు. లోపలికి వచ్చిన శశి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్ని వేస్తుంది శశి.
ఆ మాటలకి ఎవరు నవ్వరు సరి కదా మోహలు చిన్న బుచ్చుకుంటారు. తను ఎంత నవ్వించాలని చూసినా ఎవరు నవ్వరు. వాళ్ల మమ్మీ మమ్మల్ని ఎన్ని మాటలు అన్నది అని ఫోన్లో చెప్పిన కూడా తను ఇంత హ్యాపీగా ఎలా ఉందో అనుకుంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి. అది శశి గమనిస్తుంది కానీ పట్టించుకోదు. ఎవరు ఆన్సర్ చెప్పకపోవడంతో నేనే గెలిచాను కాబట్టి పార్టీ ఇస్తాను అంటూ అందరికీ కేక్ ఇస్తుంది. ఎవరు తినకపోవడంతో తినండి అంటుంది.
శశిని ఓదారుస్తున్న అభి కుటుంబ సభ్యులు..
మీ అమ్మ మమ్మల్ని నానా మాటలు అందని మేము బాధపడతామని మమ్మల్ని సంతోష్ పెట్టాలని చూస్తున్నావు కదా అంటాడు అభి వాళ్ళ పెదనాన్న. నీ బాధని దిగమింగుకొని మా బాధని తగ్గించాలని చూస్తున్నావు అంటే నీది ఎంత మంచి మనసు అర్థం అవుతుంది అభి వాళ్ల అత్త. కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ ఆమెని హత్తుకుంటుంది శశి. మా అమ్మ వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు ఆమె తరపున నేను సారీ చెప్తున్నాను అంటుంది శశి.
అలాంటిదేమీ లేదు నువ్వు బాధపడకు అంటూ ఆమెకి కూడా ఒక కేక్ ఇస్తుంది అభి వాళ్ళ అత్త. నీ చేతిలో ఒకటి కేకు ఉంది మరి అభి కో అంటాడు రాఘవ. సీమటపాకాయ్ కి నేను తీసుకొని రాలేదు. ఆవిడ గారు ఇక్కడికి వచ్చి గొడవ చేసింది కదా ఏం జరిగిందో తెలుసుకుందామని అభికి ఫోన్ చేస్తే ఆవిడ మీద కోపాన్ని నామీద చూపించాడు. అప్పుడే తాళి కట్టిన మొగుడు లాగా నా మీద రెచ్చిపోతున్నాడు అంటుంది శశి. మా ఫ్యామిలీ ని ఎవరైనా ఏమైనా అంటే వాడు తట్టుకోలేడు అంటాడు అభి తండ్రి.
అభి కి సారీ చెప్పిన శశి..
నేను కూడా మీ ఫ్యామిలీని ఎవరైనా అంటే ఊరుకోను అలాగని ఆవిడ మీద కోపాన్ని సీమటపాకాయ్ మీద చూపించలేదు కదా అంటుంది శశి. మా ఇంటి నుంచి వచ్చిన మనిషి వల్ల కదా ఎంత ప్రాబ్లమ్ అయింది నేనే కాంప్రమైజ్ అయ్యి ఈ కేకు అభికిస్తాను అంటూ అభి రూమ్ లోకి వెళుతుంది శశి. తనని చూసిన పట్టించుకోడు అభి. అతనికి సారీ చెప్పిన వినిపించుకోడు అభి. నీకు సారీ చెప్తున్నాను వినిపిస్తుందా ఏమైనా సౌండ్ ప్రాబ్లమా వెళ్లి బాగు చేయించుకో అంటుంది శశి.
నీకే మెంటల్ నువ్వే వెళ్లి చెక్ చేయించుకో అంటాడు అభి. నాకు మెంటలా అంటుంది శశి. సిచువేషన్ తో సంబంధం లేకుండా నవ్వే వాళ్ళని మెంటల్ అని అంటారు అయినా మీ అమ్మ మెంటాలిటీ తెలిసి ఆవిడని ఇక్కడికి పంపించావ్. ఆవిడ మమ్మల్ని అనరాని మాటలు అన్నది ఆ మాటలు నీకు చెప్పినా కూడా ఇంకా నవ్వుతున్నావ్ అంటే నీ గురించి ఏమనుకోవాలి అంటాడు అభి. ఆవిడని నేను పంపించలేదు అంటుంది శశి.
Pallakilo Pellikuthuru December 31 Today Episode: కాంప్రమైజ్ అవ్వని అభి..
అయినా ఎప్పుడూ నన్నే బ్లైండ్ చేస్తావు నీలాంటి వాళ్లకి సారీ చెప్పినా వేస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది శశి. అభి కి నచ్చజెప్పి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేయాలని చూస్తాడు అవి వాళ్ళ బాబాయ్. కానీ కాంప్రమైజ్ అవ్వలేకపోయినా అభి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకే అంటుంటే నాకెంత ఉండాలి అనుకుంటూ శశి కూడా కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.