Pallakilo Pellikuthuru January 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కింద పడిన డైరీ ని చదువుతాడు అభి. అందులో తన భార్యకు కావలసిన లక్షణాలని రాసుకుంటాడు అభి. అందులో ఒక్కొక్క లక్షణానికి శశి సూట్ అవ్వడంతో ఒక్కొక్కటి టిక్ పెడతాడు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టపడని శశి ఇప్పుడు నా కుటుంబాన్ని ఇష్టపడుతోంది అంటే తనలో మార్పు మొదలవుతుంది అని మనసులోనే అనుకుంటాడు శశి.
దొంగలా అభి రూములో దూరిన వాళ్ళ బాబాయ్..
డైరీ ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే వాళ్ల వదిన చూసి ఇందులో శశి గురించి ఏదో రాసుకొని ఉంటాడు అందుకే అంతా ఆనంద పడిపోతున్నాడు ఈ విషయం అర్జెంటుగా మావయ్యకి చెప్పాలి అనుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. వెళ్లేటప్పుడు ఆమె పట్టీలు సౌండ్ ని గమనిస్తాడు అభి. వాడు అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అంటే శశి గురించి ఏదో రాసి ఉంటాడు పదండి చూద్దాం అనుకుంటూ దొంగల్లాగా అభి రూంలోకి దూరతారు.
అప్పుడే అభి బాత్రూం కి వెళ్లడంతో వాడు వచ్చేలాగా ఆ డైరీ పట్టుకు పోదాం అనుకుంటారు వాళ్ళు. అంతలో బాత్రూం నుంచి వచ్చిన అభి వాళ్ళని చూసి షాక్ అవుతాడు నా రూమ్ లో ఏం చేస్తున్నారు అని అడిగితే నా ఐడి కార్డు వెతుక్కుంటున్నాను అంటాడు వాళ్ళ బాబాయ్. నీ ఎడికక్కడే నా రూమ్ లో ఎందుకు ఉంటుంది బాబాయ్ అంటే అవును కదా నా రూమ్ లోనే వెతుక్కుంటాను అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
ముందే పసిగట్టానంటున్న అభి..
వాళ్ళ అన్నయ్య వదినల్ని కూడా ఆటపట్టిస్తాడు అభి. వాళ్లు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతే రూమ్ లాక్ చేసుకుని తన బుక్ తీసుకుంటాడు. పట్టీల సౌండ్ విన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అంటూ దాచిన బుక్ ని తీస్తాడు. శశిలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది అలా అని అన్ని మార్పులు వస్తాయని గ్యారెంటీ లేదు, మీరు మళ్లీ హోప్స్ ఎక్కువ పెట్టుకుంటారు అందుకనే ఈ బుక్ మీకు చూపించట్లేదు అనుకుంటాడు అభి.
మరోవైపు భర్త కూతురు తనని అసహ్యించుకోవటం గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుభాషిని. ఇక్కడ ఎవరికీ నేను ఉండడం ఇష్టం లేదు నేను యూఎస్ వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నేను నా కూతురుతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను. కానీ నా కూతురుతోనే ఉండడం ఎలా అంటూ ఆలోచనలో పడుతుంది. అంతలో తన ఫ్రెండ్ ఇచ్చిన సలహా గుర్తొస్తుంది. విడదీసే రూట్లో వెళ్లి ఇప్పటికీ రెండుసార్లు ఫెయిల్ అయ్యారు అంటే మీ రూట్ మార్చాలి అన్న తన ఫ్రెండ్స సలహా గుర్తొస్తుంది.
ఆలోచనలో పడ్డ సుభాషిని..
అవును రివర్స్ రూట్లో వెళ్లి, నవరసాల్లో నటించి అందరిని నమ్మించి నేను అనుకున్నది జరిగేలా చేయాలి రేపే నా డ్రామా స్టార్ట్ చేస్తాను అనుకుంటుంది సుభాషిని. సీన్ కట్ చేస్తే అభి వాళ్ల ఇంటికి వచ్చిన సుభాషిణిని చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి మళ్లీ వచ్చింది అని ఒకళ్ళంటే చేయవలసిన ఘనకార్యం ఇంకా ఏమైనా మిగిలిందేమో అంటాడు అభి. కొమ్మల్లోనే ఆగిపోయారని లోపలికి రండి అంటాడు పెదనాన్న. లోపలికి రమ్మని మంచి మనసు మీకు ఉన్న వచ్చే అర్హత నాకు లేదు అందుకే ఇక్కడే నిలబడిపోయాను అంటుంది సుభాషిని.
అలాంటిదేమీ లేదు లోపలికి రండి అంటాడు అభి వాళ్ళ నాన్న. నా గురించి మీకు తెలిసే ఉంటుంది కెరియర్ కోసం భర్తని, కూతురిని వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి ఉంటారు. కానీ నేను వదిలేసి వెళ్ళలేదు జస్ట్ వదిలి వెళ్లాను అంతే, నా భర్త కూతురు వెతుక్కుంటూ వస్తారని అనుకున్నాను. ముగ్గురం కలిసి అమెరికాలోనే హ్యాపీగా సెటిల్ సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ పంతం కోసం వాళ్లు రాలేదు, నేను రిటర్న్ అవ్వలేదు.
రివర్స్ డ్రామా ప్లే చేస్తున్న సుభాషిని..
నేను అక్కడికి కేవలం కెరియర్ లో ఎదగడం కోసమే వెళ్ళలేదు, నా కూతురు భవిష్యత్తు కోసం వెళ్లాను అంటూ అతి వినయంగా చెప్తుంది సుభాషిని. అనుకున్నట్టే బాగా డబ్బు సంపాదించాను, నా కూతుర్ని కోటీశ్వరులు ఇంటికి కోడలుగా పంపించాలని ఉద్దేశంతో మళ్లీ వచ్చాను కానీ ఎక్కడికి వచ్చాకే తెలిసింది శశికి,అభి కి పెళ్లి కుదిరిందని. ఈ సంబంధం కుదిరినప్పుడు ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాను.
కానీ తర్వాతే తెలిసింది ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా గొప్పతనం ఇంత మంది మనుషులు ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అంటుంది. ఇంత గొప్ప ఇంటికి మా శశి కోడలుగా వస్తున్నందుకు తను చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. అన్ని కంఫర్ట్ లో పుట్టి పెరిగిన శశి, ఇంటికి వస్తే ఇబ్బంది పడుతుందేమో అని నా మనసుకి అనిపించింది. ఈ కాపురం వద్దు ఈ మొగుడు వద్దు అంటూ పుట్టింటికి వచ్చేస్తుందేమో అని భయపడ్డాను.
అభి కుటుంబానికి క్షమాపణలు చెప్పుకున్న సుభాషిని..
అందుకోసమే ఆ వస్తువులన్నీ మీ ఇంటికి పంపించాను కానీ మీరు అది అవమానంగా ఫీల్ అయ్యారు. నావల్ల మీరందరూ బాధపడ్డారు దయచేసి నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పుకుంటుంది సుభాషిని. నా మాటల్లో అహంకారము నా జాతరలో పొగరు కనిపించి ఉండొచ్చు కానీ అదంతా శశికి తల్లిగా మాత్రమే చేశాను ఈ విషయం శశికి చెప్తే అర్థం చేసుకోవట్లేదు కనీసం మీరైనా అర్థం చేసుకోండి అంటూ చేతులు జోడిస్తుంది.
Pallakilo Pellikuthuru January 7 Today Episode
అంతలోనే అక్కడికి శశి వస్తుంది. ఈ 15 ఏళ్ళు నేను నా కూతురు మీద అభిమానం పెంచుకుంటే నా కూతురు మాత్రం నా మీద కోపాన్ని పెంచుకుంది అంటుంది సుభాషిని. పొద్దున్నే శివుడు గారు ఎక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటుంది శశి. నేను ఎప్పుడు అమెరికాకి తిరిగి వెళ్ళిపోతాను అని ఎదురుచూస్తుంది నా కూతురు, తన పెళ్లి నేను చూడడం ఇష్టం లేదని నా మొహం మీదే చెప్పింది నా కూతురు. అందుకే వెంటనే అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటుంది సుభాషిని.
మీరు పీటల మీద కూర్చొని కన్యదానం చేయాలి కదా మీరు వెళ్లిపోవడం ఏంటి అంటుంది అభి వాళ్ళ పెద్దమ్మ. నేను పెళ్లి పీటల మీద లేకపోయినా పరవాలేదు కానీ పెళ్లిలో ఉంటే మాత్రం అభి కళ్ళలో నీరు ఉంటుంది అది నేను భరించలేను అంటుంది సుభాషిని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.