Intiki Deepam Illalu February 13 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన మనో వాళ్ళని చూసిన హరి నారాయణ వాళ్లు మీరు ఇంకా భోజనం చేయలేదా చేసేసారు అనుకోని మేము భోజనానికి కూర్చున్నాము సారీ అని చెప్పి వాళ్ళని కూడా భోజనానికి కూర్చోమంటాడు.

కృష్ణ కుటుంబ సభ్యుల్ని అవమానించిన తండ్రి కొడుకులు..

వాళ్లకి కూడా వడ్డించు అని వంట వాడితో చెప్తే ఇన్నాళ్లు మన ఇంట్లో మీరే కదా ఉండేవారు అయ్యగారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అని మర్చిపోయి పాత అలవాటు ప్రకారం కొంచమే వండాను అంటాడు. కోపం నటిస్తూ వంటవాడిని చెంపదెబ్బ కొడతాడు హరి నారాయణ. నీ సొంత డబ్బు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి వంట చేయక్కర్లేదు ఎంతమంది ఉన్నా వండి వడ్డించాల్సిందే, ఫ్రీగా తింటున్నామని మేము ఫ్రీగా వండుతున్నామని మీరు ఫీల్ అయిపోవక్కర్లేదు ఎవరు తిన్నా ఎంతమంది తిన్నా మా చెల్లిని ఆస్తిలోకి వెళ్తుందని గుర్తుపెట్టుకో అంటూ లీలావతి వాళ్ళని అవమానించే లాగా మాట్లాడుతాడు దీపక్.

నువ్వు వడ్డించే వరకు వీళ్ళందరూ అన్నదానం కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాలా అంటాడు హరి నారాయణ. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతున్న వాళ్లందర్నీ ఆపి వాడు చేసిన పనికి నేను క్షమాపణ కోరుతున్నాను హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తాను కూర్చోండి అంటాడు దీపక్. వద్దు కడుపు నిండిపోయింది అంటాడు మనో. భోజనాల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే మాకు పాపం చుట్టుకుంటుంది తినకపోతే ఒట్టు అంటూ వాళ్ళని బలవంతంగా భోజనానికి కూర్చోబెడతారు తండ్రీ కొడుకులు.

అనవసరంగా వచ్చానా అంటూ ఆలోచనలో పడ్డ మనో..

వీళ్ళకి భోజనాలు లేకుండా నాకు భోజనం చేయాలనిపించట్లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు తండ్రి కొడుకులు. మన మాటలు వాళ్లకి గుచ్చుకున్నాయంటావా అంటాడు హరి నారాయణ. బాగా అంటాడు దీపక్. భోజనం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని చూసి నవ్వుకుంటారు తండ్రి కొడుకులు. పనివాళ్ళు వడ్డిస్తుంటే తృప్తిగా తినలేక పోతారు వాళ్ళు. ఎవరైనా అల్లుడు ఇల్లరికం వస్తాడు కానీ ఇక్కడ కుటుంబం కుటుంబం మొత్తం వెళ్ళటానికి వచ్చింది సిగ్గులేకుండా అని పనివాళ్ళు మాట్లాడుకోవడం వింటాడు మనో.

పని వాళ్ళే ఇలాగా మాట్లాడుకుంటున్నారు అంటే ఊర్లో వాళ్ళు ఇంకెలా మాట్లాడుకుంటున్నారో అనుకుంటాడు. మరోవైపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కూడా హర్ష చేయలేదు. హర్ష చెప్పింది నమ్ముతారు అన్న గ్యారెంటీ లేదు వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలియట్లేదు, ఫోన్ చేస్తే బాగోదని మెసేజ్ పెట్టాను అయినా ఇంకా రిప్లై ఇవ్వలేదు అనుకుంటుంది హారిక. అంతలోనే హర్ష హారిక కి ఫోన్ చేసి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తావని నాకు తెలుసు నువ్వు చెప్పినట్లే చెప్పి ఇక్కడ అందరినీ నమ్మించాను అంటాడు హర్ష.

జరిగిందంతా హారికకి చెప్తున్న హర్ష..

వాళ్ళ రియాక్షన్ ఏంటి అని హారిక అడిగితే నిన్ను చాలా తిట్టారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ కూల్ చేసినందుకు అన్నయ్య నిన్ను చాలా తిట్టాడు అంటాడు హర్ష. మీ అమ్మగారిని నాన్నగారి రియాక్షన్ ఏంటి అని హారికడితే వాళ్ళందరూ నీ గురించి చాలా బ్యాడ్ గా రియాక్ట్ అయ్యారు మా నాన్నగారైతే నీ అంతు తేలుస్తానంటూ కోపంతో ఊగిపోయారు నిన్ను వదిలేయాలంటూ నా దగ్గర మాట తీసుకోబోయారు. నాకు గుండె ఆగినంత పని అయింది అంటాడు హర్ష.

దేవత అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలాగా ఫీల్ అవుతున్నావ్ తప్పులేదు అనుకుంటుంది హారిక. మా వాళ్ళ అందరి దృష్టిలో నువ్వు చెడు అవడం నాకు చాలా బాధగా ఉంది అంటాడు హర్ష. ఎన్నన్నా వాళ్ళు మన ఫ్యామిలీ ఏ కదా వాళ్లకోసం నేను ఎన్ని మాటలు అయినా భరిస్తాను, వాళ్ళందరూ నా గురించి మంచిగా అనుకునే వరకు నేను ఎదురు చూస్తాను అంటుంది హారిక. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటాడు హర్ష. మీ వదిన రియాక్షన్ ఏంటి అని హారిక అడిగితే నేను వాళ్లతో కలిసి ఉండాలంటే హారికతో కలిసి ఉండాలని కండిషన్ పెట్టింది అంటాడు హర్ష.

హర్ష కి జాగ్రత్తలు చెప్తున్న హారిక..

మనకు కావలసింది కూడా అదే కదా నాలుగు రోజులు తనతో కలిసి ఉన్నట్లు నటిస్తే తనతోనే ఆ నిజాన్ని బయటకి కక్కించొచ్చు అంటుంది హారిక. తనతో నటించడం కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది అంటాడు హర్ష. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు అయినా నిన్ను జైలుకు పంపిస్తానని శపధం చేసింది రాశి వస్తుందంటావా అని హారిక అడిగితే వదిన చెప్తే వస్తుంది అంటాడు హర్ష. తను వచ్చిన తరువాత నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేయకు తనది క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి ఆ విషయాన్ని ఇట్టే గ్రహించేస్తుంది జాగ్రత్తలు చెప్తుంది హారిక.

ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది అంటూ ఆనందపడుతుంది. మరోవైపు భర్తని తలుచుకొని బాధపడుతుంటుంది వర్షిణి. మరోవైపు ఆలోచనలో ఉన్న హర్ష దగ్గరికి వచ్చి ఎం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు మనో. హారిక చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నావా అని జగదీష్ అడిగితే జరిగిపోయింది దాని గురించి బాధపడకు అని చెప్తాడు మనో. అంతలో లీలావతి వర్షిణిని తీసుకొని వచ్చి ఒక్కర్తె ఉంటే బాధపడుతుంది అని చెప్తుంది.

వర్షిణి కి ధైర్యం చెబుతున్న హర్ష, మనో..

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరిని చెప్పలేము ఎవరున్నా ఎవరూ లేకపోయినా జీవితం ముందుకి సాగిపోతుంది. బాధని మరిచిపోవడానికి ధైర్యం కావాలి రేపటికి ముందడుగు వేయటానికి నమ్మకం కావాలి మనో. బాధపడొద్దు నీకోసం ఆలోచించడానికి మేమందరం ఉన్నాము అంటాడు హర్ష. జీవితాన్ని ఆ దేవుడు నిర్ణయించాడు కానీ నీ జీవితాన్ని నువ్వే చే చేతిలో పాడు చేసుకుంటున్నావు నువ్వు దాని గురించి ఆలోచించు అంటూ హర్ష కి చెప్తుంది వర్షిణి.

అంతలోనే కృష్ణ దమయంతిని, రాశిని తీసుకుని వస్తుంది. దమయంతిని చూసిన లీలావతి వాళ్ళు కోపంతో ఊగిపోతారు. వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు దమయంతి అన్న మాటల్ని తలుచుకొని బాధపడతారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని లీలావతి నిలదీస్తుంది. కృష్ణ ఏదో అనబోతే నువ్వు ఆగు అంటూ జగదీష్ కూడా దమయంతిని నానా మాటలు అంటాడు. నీ కొడుకుని చంపింది మేమే అన్నావు కదా మాలాంటి హంతకుల దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు మనో.

Intiki Deepam Illalu February 13 Today Episodeదమయంతిని బయటకు పొమ్మన్న హరి నారాయణ..

అలా అంటారు ఏంటండీ అని కృష్ణ అంటే మరి ఎలా అనుమంటావు భర్త చనిపోయిన నా చెల్లెల్ని ఓదార్చాల్సింది పోయి కసాయిదాని లాగా బయటికి తరిమేసింది, మమ్మల్ని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కేకలు వేస్తాడు. వాళ్లతో పాటు మాట కలిపి తను కూడా నాలుగు మాటలు అంటాడు హరి నారాయణ. చేసిన మోసం చాలదని ఎవరికోసం వచ్చావు మళ్లీ ఎవరిని మోసం చేయడానికి వచ్చావు. నువ్వు నా కళ్ళ ఎదురుగా ఉంటే చంపేస్తాను ముందు పో బయటికి అంటూ కేకలు వేస్తాడు.

తరువాయి భాగంలో ఇకనుంచి మీరు ఎలా చెప్తే అలా వింటాను అంటుంది రాశి. మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు నువ్వు ఏం తప్పు చేసిన నేను చెప్తాను నేను ఏం తప్పు చేసినా నువ్వు చెప్పాలి అంటాడు హర్ష. హారిక ముఖ్యం అనుకొని నిన్ను వదిలేసి నేను తప్పు చేశాను అలాగే నువ్వు కూడా మా నాన్న అన్నయ్య విషయంలో ఏమైనా తప్పు చేశావా అంటాడు హర్ష. బ్లాక్ మనీ విషయం చెప్పేస్తుంది రాశి.