Sneha Reddy : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి క్రేజ్ మరియు గౌరవ, మర్యాదలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ మొదటి నుంచే సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి రావడంతో బాగానే క్లిక్ అయ్యాడని చెప్పవచ్చు.
ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాల్లో రాణిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ 5 హీరోలలో ఒకరుగా దూసుకుపోతున్నాడు. అయితే నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ టిఆర్ఎస్ కీలక నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజెన్లు ఆసక్తిగా వెతుకులాట మొదలుపెట్టారు.
అయితే ఇందుకుగల కారణాలు లేకపోలేదు. కాగా స్నేహ రెడ్డి గత కొద్ది రోజులుగా ఫోటో షూట్లతో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో రోజురోజుకీ స్నేహారెడ్డికి సోషల్ మీడియా మాధ్యమాలలో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కాగా ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలను దాదాపుగా 80 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తాజాగా స్నేహ రెడ్డి ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని చీరలో మరియు ఇతర సంప్రదాయ దుస్తులను ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతటి తాగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అల్లు స్నేహారెడ్డి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లైతే ఏకంగా ఈమధ్య అల్లూ స్నేహ రెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుందని అలాగే తన లేటెస్ట్ ఫోటోషూట్లతో మతి పోగొడతుందంటూ అని కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా ఈ ఫోటో షూట్లను చూసి తొందర్లోనే మీరు హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినప్పటికీ అల్లు స్నేహారెడ్డి మాత్రం తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై స్పందించలేదు సరి కదా కనీసం పట్టించుకోవట్లేదు. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అల్లు స్నేహారెడ్డికి సొంతంగా ఓ ఫోటోగ్రఫీ మరియు ఈవెంట్స్ ప్లానర్ సంస్థ ఉంది. దీంతో ఈ సంస్థని ప్రమోట్ చేసేందుకు అల్లు స్నేహారెడ్డి ఇలా ఫోటోషూట్ లో పాల్గొంటూ ఫోటోలకి ఫోజులిస్తోంది.