Business : చిన్న పాన్ షాప్ నుండి 300 కోట్లు వ్యాపారం వరకూ ఓ సామాన్యుడి కథ.

S K

Success Story: Business : మెరుగైన జీవన విధానం కోసం నలుగురు అన్నదమ్ముల కృషి మరియు ఆ కృషికి తగ్గ ఫలితాన్ని ఎలా చేశారో మీరు చడావబోతున్నరు. 1987లో, చావంద్ గ్రామం నుండి గుజరాత్‌కి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు వచ్చారు. ఒక రైతు కుటుంబానికి చెందిన దినేష్, జగదీష్, భూపత్ మరియు సంజీవ్ మంచి అవకాశాలు లభిస్తాయని గుజరాత్ సిటీకి వచ్చారు. వారు వాళ్ళ తండ్రి అయిన డాకుభాయ్ దగ్గర కొంత డబ్బును తీసుకొని ఒక పాన్ (తమలపాకు) మరియు కూల్ డ్రింక్ షాప్ పెట్టారు. అయితే వాళ్లకు తెలియనిది ఏంటంటే ఆ చిన్న షాప్ 300 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి పునాది అయిందని. ముపై సంవత్సరాల తర్వాత ఆ చిన్న పాన్ కౌంటర్ సహాయంతో వాళ్ళు, వందల రకాల పాల మరియు ఆహార ఉత్పత్తులు అమ్మే ఒక పెద్ద కంపెనీని స్థాపించారు. భూపత్ తమ బెటర్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వూలో వారి సక్సెస్ స్టోరీని చెప్పారు.

అంతా 5X5 అడుగుల షాపుతో ప్రారంభమయింది, “మాకు వ్యసాయం జీవనాధారంగా ఉండేది, మా ఊరిలో విద్యా సౌకర్యాలు లేకపోవడం వల్ల, చదువుకొని ఉదుగాలు సంపాదించి మంచిగా జీవించడానికి మనం అమ్రేలికి వెళ్లాలని మా నాన్న చెప్పారు” అని భూపత్ చెప్పారు.

“నలుగురిలో పేదవాడు అయిన దినేష్, మనం పాన్ షాపును బస్టాండ్ దగ్గర పెడితే రాను పోను జనలల కారణంగా మంచి సంపాదన వస్తుందని అనగా అక్కడ పాన్ షాప్ ప్రారంభించాము. 1993లో పండగకు ఐస్ క్రీమ్ కూడా అమ్మలని నిర్ణయించుకొని అమ్మగా, అది బాగా సక్సెస్ అయింది. తరువాత మేమే మెల్లగా ఐస్ క్రీమ్ తయారు చేయడం నేర్చుకొని వాటినే అమ్మసాగం” అని చెప్పారు.

Business : చిన్న పాన్ షాప్ నుండి 300 కోట్లు వ్యాపారం వరకూ ఓ సామాన్యుడి కథ.
Business : చిన్న పాన్ షాప్ నుండి 300 కోట్లు వ్యాపారం వరకూ ఓ సామాన్యుడి కథ.

1998లో, వాళ్ళు కంపెనీని శ్రీ శీతల్ ఇండస్ట్రీస్‌గా మార్చారు. మెల్లగా కంపెనీ మార్కెట్ విస్తరిస్తూ సిటీలో రిటైలార్స్కు, చివరికి జిల్లా మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా సప్లై చేసేవారు. 2012లో కంపెనీ కొత్త పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ పేరు శీతల్ కూల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుకు మార్చామని భూపత్ చెప్పారు. 2016 నాటికి, కంపెనీ నామ్‌కీన్స్ (సావరీ స్నాక్స్) మార్కెట్ సెగ్మెంట్స్ లోకి విస్తరించిన తర్వాత కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, శీతల్ కూల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా మార్చారు.

ఈరోజు, కంపెనీ రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది, ఇందులో 1,500 మంది పనిచేతున్నారు, వాళ్ళలో 800 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ ఎనిమిది సెగ్మెంట్స్ లో 500 రకాల ఉత్పత్తులను అందిస్తుంది. ఆ జిల్లాలోనే అతిపెద్ద ఉద్యోగాలు అందిచే కంపెనీ మాది అని భూపత్ చెప్పారు.

- Advertisement -