VIRAL VIDEO:పాకిస్తాన్ నుండి చాలాసార్లు ఇలాంటి వార్తలు వస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగింది. సరదాగా రోడ్డుపక్కన ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ తన ప్రపంచంలో తానూ ఊగిపోతూ ఉంది. ఆమె ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. తన మట్టుకు తానూ డాన్స్ చేసుకుంటుంది. అయితే ఆమె డాన్స్ చెయ్యడం నచ్చని కొందరు పురుషులు ఆమెను దూషించడం మొదలు పెట్టారు. ‘అటెన్షన్ సీకర్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాదు, ఆ అమ్మాయి డ్యాన్స్ చేసిన తర్వాత పోలీసులను పిలవడం గురించి మాట్లాడటం ప్రారంభించారు. అతను అమ్మాయి అనుమతి లేకుండా దూరం నుండి ఆమె వీడియోను కూడా చిత్రీకరించాడు. ఆమె ప్రైవసీకి ఇబ్బంది కలిగించారు. ఈ వీడియో చేస్తే మనకు కోపం రావచ్చు ఎందుకంటే ఆమెపై వాళ్ళు ఉపయోగించిన భాష, మాట్లాడిన విధానం అలా ఉంది.
⚠️🔴 A girl doing pole dance at I-8 Markaz, Islamabad – Where is the management? CC: @dcislamabad pic.twitter.com/evcRLg9iSz
— Showbiz & News (@ShowbizAndNewz) May 16, 2022
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. వీడియోను చూస్తుంటే, ఆమె తనకు నచ్చినట్టు ఆమె చేస్తుంటే వీళ్ళకెందుకని సోషల్ మీడియాలో వీడియో తీసినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పితృస్వామ్య సమాజంలో అబ్బాయిలు ఏదైనా చెయ్యవచ్చు కానీ అమ్మాయి మాత్రం డాన్స్ కూడా చెయ్యకూడదని అమ్మాయిలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా తామేదో గొప్ప పని చేస్తున్నట్టు పోలీసులను పిలవాలని అనుకోవడం ఆ అబ్బాయిల మూర్ఖత్వమని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అబ్బాయిల చర్యలను చట్టవిరుద్ధమని ప్రజలు ఖండించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసే మగవాళ్ళు, అమ్మాయిలు డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం ఏంటని సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి ప్రైవసీకి భాగం కలిగించిన ఈ అబ్బాయిలపై ముందు కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కేవలం పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలోనూ నిత్యం జరుగుతూనే ఉంటాయి.