Viral Video : సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయినవారిని మనం చూసిందే.చిన్న చిన్న రీల్స్ నుంచి పెద్దపెద్ద సినిమాల వరకు మంచి ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇప్పటి యువత ఒకప్పుడు ఆడిషన్స్ వెళ్లి ఆడిషన్ జరిగి ఛాన్స్ వస్తుందా రాదా అంటూ కొన్ని రోజులు వరకు వేచి చూస్తూ ఉండేవారు.అలాంటి అవకాశం లేకుండా సోషల్ మీడియాలో ఎందరో నైపుణ్యం ఉన్నవారు తమదైన స్టైల్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించి సెలబ్రిటీ రేంజ్ వెళ్లినవారు ఎందరో.
ఇటీవలే ఎనర్జిటిక్ రామ్ కృతి శెట్టి నటించిన చిత్రం ద వారియర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం . అయితే ఈ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయనే చెప్పుకోవాలి. చిన్న వారి దగ్గరుండి పెద్ద వారి వరకు కూడా ఈ సినిమాలోని పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అదరగొట్టేస్తున్నారు.అయితే ఈ పాటకు ఈ చిచ్చారు పిడుగులు తమదైన స్టైల్ లో స్టెప్పులు వేస్తూ దుమ్ము లేపు వ్యూవర్స్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మనలో ఉన్న టాలెంట్ ప్రదర్శించాలి అంటే చాలా కష్టపడాలి కానీ ఇప్పుడు సోషల్ మీడియా దయవల్ల తమ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని సెల్ ఫోన్స్ లో బంధించేసి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు.
ఈ చిచ్చరపిడుగుల స్టెప్పులకు సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. రామ్ పోతినేని కృతి శెట్టి వేసిన ఈ స్టెప్పులు ఈ చిచ్చర పిడుగులు యాస్ ఇట్ ఇస్ గా వేశారంటూ మరికొందరు హాటెస్ట్ పర్ఫామెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు వారు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుందంటూ ఇద్దరికీ ఇద్దరు అద్భుతంగా చెప్పులు వేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిచ్చరి పిడుగులు స్టెప్పులను మీరు కూడా చూసేయండి మరి. ఎలా మరెన్నో డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ పోతున్నారు ఇద్దరు ముద్దు పాపలు.