Real Incident : ఫేస్ బుక్ లో పరిచయమైన ఆంటీతో అఫైర్ పెట్టుకున్న యువకుడు… దాంతో సీక్రెట్ గా ఆంటీ ఏం చేసిందంటే….?

Joythi R

Real Incident : ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లయి పిల్లలున్నటువంటి మహిళలు లేదా పురుషులు కూడా వివాహేతర సంబంధాలు మోజులోపడి తమ కాపురాలు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా కొందరైతే కట్టుకున్న వాళ్ళకంటే పరాయి వాళ్ళు ఎక్కువన్నట్లు ప్రాణాలు తీయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. కాగా తాజాగా ఓ వివాహిత పెళ్లై భర్త ఉన్నప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చివరికి ఆ వ్యక్తి కాస్త పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడంతో డబ్బు కోసం హత్యలు చేసేవంటి వాళ్లతో కలసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలో శ్వేతా రెడ్డి అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. అయితే శ్వేతారెడ్డి అప్పుడప్పుడు టైం పాస్ కోసం సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించేది. ఈ క్రమంలో 2018 సంవత్సరంలో హైదరాబాద్ కి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే చాటింగ్ చేసే వాళ్ళు. అయితే తొందర్లోనే ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో శ్వేతా రెడ్డి పెళ్లయిన సంగతి కూడా మర్చిపోయి తన ప్రియుడితో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే కొన్ని రోజుల పాటు మీరిద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ శ్వేత రెడ్డి పై తన ప్రియుడికి ప్రేమ ఎక్కువ అవడంతో విడిచిపెట్టి ఉండలేకపోయాడు. దీంతో తన భర్తకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతా రెడ్డిపై ఒత్తిడి తెచ్చాడు.

కానీ శ్వేత రెడ్డి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె పై ఉన్నటువంటి ప్రేమ కాస్త పగ గా మారింది. ఇంకేముంది శ్వేతారెడ్డి ప్రియుడు కాస్త విలన్ గా మారి గతంలో వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలు మరియు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో రోజురోజుకీ టార్చర్ ఎక్కువైంది. అందుకే శ్వేతా రెడ్డి ఏకంగా డబ్బు కోసం హత్య చేసినట్లు ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన ప్రియుడికి అడ్డు తొలగించుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. దీంతో శ్వేత రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయట పడ్డాయి.

- Advertisement -