Viral News: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది భార్య భర్తలు ఒక బాబు లేదా పాపను కనడానికి మాత్రమే ఆసక్తి చూస్తున్నారు. ఈ కాలంలో ఇద్దరు పిల్లలను కనడం వల్ల వారికి సరైన న్యాయం చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో ఒకరే చాలని చాలామంది అనుకుంటున్నారు. ఇలా ఒకరిని పెంచి పోషించడమే కష్టతరంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలతో 60 మంది పిల్లలను కనడమే కాకుండా నాలుగో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు.
వినడానికి ఆశ్చర్యంగా షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం ఇంతకీ 60 మంది పిల్లలకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… పాకిస్తాన్ కి చెందిన సర్దార్ హజీ జాన్ మహమ్మద్ అనే వ్యక్తి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని 60 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఈయన 60 మంది పిల్లలకు తండ్రి కావడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ 60 మందిలో ఐదు మంది పిల్లలు చనిపోయారని ప్రస్తుతం 55 మంది పిల్లలు ఉన్నట్టు సర్దార్ తెలిపారు.
Viral News: పెద్ద కుమార్తె వయసు 22 సంవత్సరాలు….
ఇక తన పెద్ద కుమార్తె వయసు 22 సంవత్సరాలు అని ఈయన తెలియజేశారు. ఇలా తనకు 60 మంది పిల్లలు ఉన్నప్పటికీ తన భార్యలు మాత్రం మరి కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లు ఈయన తెలిపారు. అదేవిధంగా ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని 60 మందికి జన్మనివ్వగా…మరోసారి నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని మరి కొంతమంది పిల్లలకు జన్మనివ్వడానికి తాను ఆసక్తిగా ఉన్నానని సర్దార్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన గురించి తెలుసుకున్నటువంటి నేటిజన్స్ వాడు నిజంగా మగాడ్రా బుజ్జి అంటూ అతడు సినిమాలోని డైలాగ్స్ ఇతనిపై వాడుతున్నారు.