Viral News: మామూలుగా ఎప్పుడు ఎవరికీ ఎలా దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు బాగా సంపాదించిన వాడు భవిష్యత్తులో ఏమీ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఏమి లేక అడుక్కు తినేవాళ్లు భవిష్యత్తులో ధనవంతులు కావచ్చు. ఇటువంటివి చాలా తక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. చాలావరకు ఒక మామూలు వ్యక్తి కోటీశ్వరుడు కావాలి అంటే ఏదైనా లాటరీ తగిలితేనే అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు కావడం అంటే మామూలు విషయం కాదు.
ఇక కొంతమంది ఏమి సంపాదించకుండా తాతల తరం సంపాదించిన ఆస్తులను అదృష్టం కొద్దీ సొంతం చేసుకుంటారు. ఇప్పుడు అటువంటిదే ఒక పదేళ్ల కుర్రాడు సొంతం చేసుకున్నాడు. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉత్తర ప్రదేశ్ లోని పండౌలి గ్రామానికి షాజేబ్ ఆలం అనే 10 ఏళ్ళ బాలుడు రూర్కీ లోని కలియార్ మందిరంలో భిక్షాటన చేస్తూ ఉంటాడు.
అయితే ఇతడు గత ఏడాది తన తల్లిదండ్రులు మరణించడంతో పండౌలి నుండి పారిపోయి రూర్కీలో అనాధగా అడుక్కుంటూ బతుకుతున్నాడు. అయితే అతడు ఇంటి నుంచి పారిపోయిన కొన్ని రోజులకు తన తాత మహమ్మద్ యాకూబ్ కూడా మరణించాడు. దీంతో ఆయన వీలునామ ప్రకారం రెండంతస్తుల ఇల్లు, రెండు కోట్ల విలువైన భూమి తన సొంతం చేసుకున్నాడు షాజేబ్.
Viral News: కోటీశ్వరుడైన భిక్షాటన చేసే బాలుడు..
దీంతో షాజేబ్ కోసం తన బంధువులు వెతకటంతో చివరికి రూర్ కీ లోని కలియార్ మందిరంలో భిక్షాటన చేస్తూ కనిపించాడు. దీంతో అతడిని దగ్గరికి తీసుకొని తన తాత అందించిన వీలునామ ప్రకారం ఆ ఆస్తి మొత్తం అందజేశారు. ఇక ఈ విషయం ప్రస్తుతం బాగా వైరల్ అయింది. ఇక ఈ వార్త చదివిన వాళ్లంతా ఆ పదేళ్ల బాలుడు అదృష్టవంతుడు అంటూ.. మందిరం దగ్గర బిక్షాటన చేయడం దేవుడు కరుణించి ఆ విధంగా అతడికి సహాయం చేశాడు అని అనుకుంటున్నారు.