Viral Video: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం పెద్ద ఎత్తున సాహసాలు చేస్తూ వీడియోలు చేస్తుంటారు. ఇలా వీడియోలు చేసే సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి.ఈ ప్రమాదాల వల్ల కొందరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే మరికొన్ని ప్రమాదాలు జరిగిన చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఇలాంటి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం ఎంతోమంది ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలోని ఈ వీడియోలో ఓ యువతీ కూడా అలాంటి సాహసమే చేసింది.
ఈ వీడియోలో భాగంగా బర్రెకు దానవేస్తూ అనంతరం దాని ముందు డాన్స్ చేసింది. ఇలా బర్రె ముందు డాన్స్ చేస్తే వెరైటీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ యువతి బర్రె ముందు డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ బర్రె ఒక్కసారిగా ఆ యువతిపై దాడి చేయడంతో ఆమె పక్కనే ఉన్న నీటి తొట్టెలో పడింది. అయితే ఈ ప్రమాదంలో ఆ యువతికి ఏమీ కాకపోవడంతో ఈ వీడియో అందరికీ నవ్వు తెప్పిస్తుంది. లేదా ఆ బర్రె తనని దాడి చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఆ యువతీ ఎంతో బాధపడాల్సి వచ్చేది.
Viral Video: బర్రె దెబ్బకు ఆమడ దూరం పడిన యువతి…
ప్రస్తుతం ఇలా బర్రె ముందు ఆ యువతి చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈమె డాన్స్ చేస్తుండగానే బర్రె దాడి చేయడంతో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతో నవ్వు తెప్పిస్తుంది.ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవ్వడమే కాకుండా ఎంతో మంది ఈ వీడియో పై స్మైలీ ఎమోజిలను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా చూసి మీరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడండి.